బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్
ఈ రోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ వంద మంది బిసి కార్యకర్తలతో ఏర్పడడం జరిగినది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్ .. ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి , ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల సంక్షేమమే ప్రధాన ఆశయంగా పనిచేస్తానని చెప్పిన భగవాను దాసు వెంటనే , బీసీలను ఒకతాటి మీదకు తీసుకువచ్చాడని తెలియజేశారు.
స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని …
కాలమానాలు మారిన బీసీ బతుకులు మారలేదని. సర్వసంపదలు సృష్టికర్త బీసీలు అయినా ఇంకా వెనుకబడి ఉండడం చాలా బాధకరమైన విషయమని తెలియజేశారు. బీసీల జీవితాల్లో చీకటి చీల్చుకుంటూ వెలుగులు రావాలి అంటే బీసీలలో చైతన్యం రావాలని బీసీలు ఐక్యం కావాలని అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలి అని అంతేకాకుండా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన బీసీ హక్కులు కాలరాసిన పరాభవం ఎదురైనా బీసీదల్ మీ వెంటే ఉంటుందని తెలియజేశారు.. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు పన్నెండు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అందులో పదకొండు వందల మంది బిసిలు ఉన్నారని, బీసీలు త్యాగాల గురించి మరియు పోరాట తత్వం గురించి నిదర్శనమని తెలియజేశారు.
జనాభా ప్రకారం బీసీలు రిజర్వేషన్లు 52% పెంచాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి.
సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని, రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి అని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించే విధంగా పోరాటం చేయాలని తెలియజేశారు. రాజకీయ అధికారం వస్తే అన్నీ వస్తాయి అందుకే రాజకీయ అధికారం సాధించే దిశలోనే దృష్టి పెట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాణిక్యము, బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మేడ్చెల్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ ,మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య మరియు రమణ వెంకటేశ్వరరావు మరియు బిసి బంధుమిత్రులు పాల్గొన్నారు