- న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలన్న సుప్రీం సీజే వ్యాఖ్యలను పూర్తిగా సమర్దిస్తున్న బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి..
- సుప్రీం, హైకోర్టు జడ్జీల నియామకాలలో బిసి,ఎస్సి, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపేదే లేదు అని అల్టిమేటం జారీ చేసిన బిసి దళ్ అధ్యక్షుడు..
- దేశంలోని ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తుల నియామకాలలో బడుగులకు అన్యాయం జరుగుతుందని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన కుమారస్వామి.
……………………………………………………………….
హైదరాబాద్ : మొన్న జరిగిన హైకోర్టు ప్రాధాన న్యాయమూర్థుల సమావేశంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. రమణ గారు మాట్లాడిన వాఖ్యల్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
దేశంలోని హైకోర్టు న్యాయమూర్తల నియమాకాల్లో బిసి,ఎస్సి, ఎస్టీ,మహిళా, మేనార్టీ లకు తగినంత ప్రాతినిధ్యం లేదనే విమర్శలు ఇప్పుడు వస్తున్నాయని, ఇలాంటివి మళ్ళీ రాకుండా ఉండాలంటే న్యాయమూర్తుల నియామకలలో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సామాజిక న్యాయం అమలుకు చర్యలు తీసుకోవాలని కొరినందుకు చీఫ్ జస్టిస్ రమణ గారికి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు..
స్వాతంత్ర్యo వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న 90% ఉన్న బడుగులకు ఉన్నత న్యాయస్థానాలలో పది శాతం కూడా ప్రాతినిధ్యం లేదని కుమారస్వామి అన్నారు. రాజకీయ పార్టీలలో మాదిరిగా న్యాయస్థానాలలో కూడా అక్కడక్కడ వారసత్వం నడుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు
కొంతమంది హైకోర్టు ప్రాధాన న్యాయమూర్తులు కొలీజియంకు సిఫార్సు చేసే వాళ్లలో, వాళ్ళ బంధువులు, వాళ్ల కులం వాళ్లు కూడా ఉంటున్నారని, దీనితో అగ్ర కులానికి చెందిన వారు న్యాయమూర్తులుగా ఎక్కువగా అవుతుంటే..బడుగు బలహీన వర్గాలకు చెందినవారు అన్ని ఆర్హతలు ఉన్నప్పటికీ తాము పుట్టిన కులమే కొన్ని సందర్భల్లో న్యాయమూర్తులు కావడానికి తమకు ఆనర్హతగా మారుతుందని కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు.
ఉన్నత న్యాయస్థానాలలో బడుగులు లేకపోవడం మూలంగా రిజర్వేషన్ల వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని, బీసీల విషయంలో రిజర్వేషన్లు 50% దాటితే అర నిమిషంలో కొట్టి వేసే కోర్టులు, అగ్రకుల రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 60% దాటినా కూడా కనీసం స్టే లు కూడా ఇవ్వడం లేదని దుండ్ర ఉధర్వహించారు
ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ సీజే జస్టిస్ రమణ గారు కల్పించుకొని బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీలకు ఒక హాక్కుగా, నాయమూర్తులుగా అవాకాశాలు రావాలంటే పార్లమెంటు లో బిల్లు పెట్టించి బడుగులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు, అప్పుడే మున్సిప్ కోర్టు నుండి సుప్రీం కోర్ట్ వరకు సామాజిక న్యాయం జరుగుతుందని దుండ్ర కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.