ఇండియా కూటమికే బీసీ సంఘాల మద్దతు-జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి.. బీసీల సమస్యలపై మాట్లాడే వ్యక్తులను పార్లమెంట్ కు పంపాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy)
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. అలాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి మరింత బలాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే మనకు అర్థం అవుతుంది.. దేశంలోని సంపద సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయబద్ధంగా అందాలంటే కులగణన చేపట్టాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం అని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల పై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం శుభసూచికమని అని తెలిపారు.బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని దుండ్ర కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీకి బీసీల ఓట్లు అడిగే హక్కు లేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. దేశంలోని బీసీ సంఘాల మద్దతు కూడా కాంగ్రెస్కే ఉందన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీలను విస్మరిస్తున్న బీజేపీని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీసీల సమస్యలపై మాట్లాడే వ్యక్తులే పార్లమెంటులో ఉండాలని దుండ్ర కుమారస్వామి(Dundra kumara Swamy)పిలుపునిచ్చారు.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా ఉంది కానీ నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి విధంగా అందుబాటులో లేదన్నారు దుండ్ర కుమారస్వామి. ప్రజల జీవనోపాధిని ఊహించని విధంగా నాశనం చేసింది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల దేశానికి ఊహించినదానికంటే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ ఎస్‌ల ఉపాధికి నష్టం జరిగింది. ప్రైవేట్ సంస్థలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ఉండదు.. అలా బీసీల జీవనోపాధికి తీవ్రమైన హాని చేస్తోంది బీజేపీ అని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో , ముదిరాజ్ కుల సంఘం నేత గాంధీ నారాయణ, మున్నూరు కాపు కుల సంఘం నేత సత్యనారాయణ, మహేంద్ర బాబు వెంకటరమణ, రాజేష్ యాదవ్, సాయి, చరణ్, తదితరులు పాల్గొన్నారు.