క్రికెట్ లో బడుగు బలహీన వర్గాలు రాణించాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మేరా క్రికెట్ లీగ్ (ఎంసీఎల్) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు హాజరయ్యారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వాహకులకు, ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
టోర్నమెంట్ ప్రారంభ సమయంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ టాలెంట్ ఉన్న యువకులను బయటకు తీసుకుని రావడానికి ఎంసీఎల్ ఓ వేదిక అని చెప్పారు. మొదటి సీజన్ భారీ సక్సెస్ అందుకోవాలని దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు. టాలెంట్ ఉన్నా నిరూపించుకోడానికి సరైన వేదిక దొరకడం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారని.. అలాంటి వాళ్ళు ఎంసీఎల్ ను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ టోర్నమెంట్ ను చూడడానికి పలువురు వ్యక్తులు వస్తూ ఉంటారని.. ఒక్కరి కంట్లో మీ టాలెంట్ పడినా దశ మారిపోవచ్చని అన్నారు దుండ్ర కుమారస్వామి.
క్రీడా రంగంలో బడుగు బలహీన వర్గాలు రాణించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నిజాం క్లబ్ అందుకోసమే ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ అద్భుతమైన వేదిక.. ఇక్కడ మెరిసిన ఆటగాళ్లు తర్వాత హైదరాబాద్, తెలంగాణ జట్లలోనే కాకుండా భారత జట్టులో కూడా స్థానం సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఉన్నామని అన్నారు. భారత జట్టులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మంది ఉండే రోజులు రావాలని కోరుకుంటున్నట్లు దుండ్ర కుమారస్వామి అన్నారు. క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని.. ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా స్పోర్టివ్ గా తీసుకోవాలని సూచించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. ఎంసీఎల్ ను అందరూ కలిసి సక్సెస్ చేయాలని.. అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంసీఎల్ కమిటీ మెంబర్లకు దుండ్ర కుమారస్వామి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.