అసుస్ వివోబుక్ ఎస్14
అసుస్ టెక్నాలజీస్ సంస్థ వివోబుక్ ఎస్14 పేరిట మూడు కొత్త ల్యాప్‌టాప్ మోడల్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్‌లను ఈ ల్యాప్‌టాప్స్ కలిగి ఉన్నాయి. వీటిని వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఈ ల్యాప్‌టాప్‌లను డిస్కౌంట్ ధరలకు విక్రయించనున్నారు. వీటి ప్రారంభ ధర రూ.44,990గా ఉంది.
అసుస్ విడుదల చేసిన వివోబుక్ ఎస్14 మోడల్ ల్యాప్‌టాప్‌లలో
14 ఇంచ్ డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సి, 2 ఇన్ 1 కార్డ్ రీడర్, ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.