హైదరాబాద్: అరియానాకి RGV దగ్గరుండి వర్కౌట్లు నేర్పిస్తున్న ..రచ్చ మాములుగా లేదుగా..
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనుకునే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతగా రెచ్చిపోతుంది ఈ భామ. బిగ్ బాస్ కంటే ముందు యూ ట్యూబ్‌లో బాగానే ఫేమస్ అయిపోయింది అరియానా. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అమ్మడు రేంజ్ మారిపోయింది. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆయన చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
అయితే, లేటెస్ట్ గా వర్మతో ఈ బ్యూటీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయ్. ఇందులో బిగ్ బాస్ అరియానా స్పోర్ట్స్ బ్రాలో దర్శనమివ్వగా ఆమె వెనకాల నుంచుని ఉన్న రామ్ గోపాల్ వర్మ డంబుల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించాడు. అంతేకాక ఈ బిగ్బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ నన్ను జిమ్ లో ఉండగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందని అన్నాడు. అక్కడితో ఆగక ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్ చేశాం అని చెబుతూనే కమింగ్ సూన్ అని కూడా కామెంట్ చేశాడు. ఈ ఫోటో దెబ్బకు పెద్ద ఎత్తున వర్మ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సరదాగా జరిగిన ఇంటర్వ్యూనా లేక గతంలో వర్మ చెప్పినట్లు ఏమైనా సినిమాలో అవకాశం ఇస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.