తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరుతో రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, అందెశ్రీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్ఠించి, ఆయన జయంతి మరియు వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని డా. కృష్ణమోహన్ రావు కోరారు.