యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ తెలుగు యాంకర్ అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో కూడా నిలుస్తుంది. యాంకరింగ్‌తో పాటు కొన్ని పాత్రలు ప్రత్యేకంగా ఎన్నుకుని సినిమాల్లో కూడా తనదైన గుర్తింపును తెచ్చుకుంది.
పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో బాగా హిట్టయిన అనసూయకు ఇప్పుడు మూవీస్ లో చాలా ఆఫర్లు వస్తున్నాయట. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేస్తారు. అనసూయ కూడా ట్వీట్ చేసింది. కానీ హ్యాప్పీ ఫూల్స్ డే అని చేసింది. “ట్రోల్ చేసే వారికీ, మీంస్ చేసేవారికీ, ఈరోజు మహిళల దినోత్సవం అని హఠాత్తుగా గుర్తొచ్చి స్త్రీలను గౌరవిస్తారు. అయినా ఈ గౌరవం ఒక రోజులో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే’ అని ట్వీట్ చేసి షాకిచ్చింది.దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.