తెలంగాణ లో కరోనా కష్టాలు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు వ్యాక్సిన్ లేక, ఆక్సిజన్ అందక, పరేషాన్ లో ఉన్న ప్రజలను, అంబులెన్స్ మాఫియా అడ్డగోలుగా దోచుకుంటుంది. 2 కోలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి చేర్చడానికి 6 నుండి 10 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే కరోనా పేషెంట్ అయితే 15 వేలు దాకా అన్యాయంగా వసూలు చేస్తున్నారు. ప్రాణం ఉంటే ఒక రేటు, ప్రాణం లేకుంటే ఒక రేటు అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తూ అడ్డగోలుగా దోచేస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్లు.
గాంధీ హాస్పిటల్ బయట వందకు పైగా అంబులెన్స్ లు అడ్డగోలుగా దోచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. రోడ్ల మీదే బేరాలు ఆడుకుంటూ, హాస్పిటల్ లోనే దందా చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మా “తొలిపలుకు” ప్రాతినిది ఒకరు వాళ్లకు ఫోన్ చేసి అడగ్గా, రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళడానికి, కరోనా ఉన్న పేషేంట్ అయితే ఒక రేటు, కరోనా లేకుంటే ఇంకో రేటు చెప్తున్నారు. కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అంబులెన్స్ రేటు వింటేనే “అమ్మో అంతనా” అనే విధంగా నీచమైన వ్యాపారం చేస్తున్నారు అంబులెన్స్ యాజమానులు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి చేర్చడంలో అండగా ఉండి ఆదుకోవాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు అడ్డగోలుగా దోచుకోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని, సామాన్య ప్రజలకు రేట్లు అందుబాటులో ఉండేలా చూడాలని హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు..