దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు.
Last Video of Sridevi
అందాల నటి శ్రీదేవి(54) దుబాయ్‌లో గుండెపోటుతో శనివారం రాత్రి కన్నుమూశారు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందినట్లు సంజయ్ కపూర్ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె 200లకు పైగా సినిమాల్లో నటించారు. శ్రీదేవి హఠాన్మరణంతో.. సినీ లోకం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ను1996లో శ్రీదేవి వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. జాహ్నవి, ఖుషి.
1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్‌గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే మామ్ చిత్రంతో నటించి అందరిని అలరించారు.
200లకు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. తెలుగులో అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి లక్షల సంఖ్యల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చాందిని, లమ్హే, మిస్టర్ ఇండియా, నాగిన వంటి బ్లాక్‌బ్లాస్టర్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. చివరిసారిగా మామ్ చిత్రంలో నటించారమె. కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా సినిమాల్లో శ్రీదేవి నటించారు.
Shocked to hear of passing of movie star Sridevi. She has left millions of fans heartbroken. Her performances in films such as Moondram Pirai, Lamhe and English Vinglish remain an inspiration for other actors. My condolences to her family and close associates #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) February 25, 2018