వేములవాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని తుది దశ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. వేములవాడ పట్టణంలో నిర్మాణ ప్రగతిలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ వైద్యారోగ్య శాఖా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా తుది దశ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా చూడాలని అన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత ఆసుపత్రి సామాగ్రిని పూర్తి స్థాయిలో సమకుర్చేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అవసరమైన సిబ్బందిని నియమించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖా అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట వైద్యారోగ్య శాఖా అధికారి శ్రీ డా.సుమన్ మోహన్ రావు, సంబంధిత అధికారులు ఉన్నారు.