ఈరోజు తెలంగాణ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జెన్నాయి గూడ గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ దళ్ జెన్నైగుడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
గ్రామానికి చెందిన సురేందర్ ని యువత అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, కార్యవర్గ సభ్యులు పలు బీసీ రైతు సమస్యలు మరియు గ్రామ సమస్యలు కుమారస్వామి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి స్పందించిన బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి సమస్యల పరిష్కారానికై మరియు అభివృద్ధి కై తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిసిలు సామాజికంగా, ఆర్ధికంగా అన్నీ రంగాలలో అభివృద్ది చెందాలని అన్నారు. అలాగే యువకులు అన్నీ రంగాలలో ముందుండి, బిసిల అభివృది కి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ నరసింహ శ్రీకాంత్ శంకర్ సురేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more