*శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్కు ఘన నివాళులు*
*బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటు.. ఆయన సేవలు చిరస్మరణీయం*
శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ చక్రపాణి యాదవ్ గారి మరణం బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటని సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె
రామకృష్ణ, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఆయన మరణవార్త పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పల్లా వెంకటరెడ్డి, రామకృష్ణ, దుండ్ర కుమారస్వామి కలిసి శ్రీ చక్రపాణి యాదవ్ గారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాజీవితంలో శాసనమండలి మాజీ చైర్మన్గా ఆయన అందించిన విశిష్ట సేవలను, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, యాదవ సమాజ ప్రగతికి చేసిన కృషిని వారు స్మరించుకున్నారు.
చక్రపాణి యాదవ్ గారితో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని, యాదవ మహాసభ కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని దుండ్ర కుమారస్వామి(Dundra Kumara Swamy) గుర్తుచేసుకున్నారు. ఆయన నాయకత్వం, సమాజ సేవ, ప్రజాజీవితంలో అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ముగ్గురూ పేర్కొన్నారు.
ఈ విషాద సమయంలో చక్రపాణి యాదవ్ గారి కుటుంబ సభ్యులకు పల్లా వెంకటరెడ్డి, రామకృష్ణ, దుండ్ర కుమారస్వామి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.





