రాఖీ కట్టిన రాజ్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీ రావు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు రాజ్ న్యూస్ ఛానల్ కార్యాలయంలో ఛానల్ చైర్మన్ లక్ష్మీ రావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామికి, సామాజికవేత్తలకు మరియు పలువురు ప్రముఖులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి, లక్ష్మీ రావుకు చీర బహూకరించగా, ఆయన లక్ష్మీ రావు ఆశీర్వాదం పొందారు. అనంతరం కుమారస్వామి తన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, రాఖీ పండుగ సోదరీ–సోదర బంధానికి ప్రతీకగా, బంధుత్వానికి పునాదిగా నిలిచే ఉత్సవమని పేర్కొన్నారు. మనసును కట్టిపడేసే ఈ రక్షాబంధన్ పండుగ మన చరిత్ర, సాంప్రదాయం, సాంస్కృతిక ఆచారాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. రాఖీ ఒక చిన్న పట్టీ అయినప్పటికీ, రక్తసంబంధాన్ని నెమరువేసుకుని చెల్లిని రక్షించాలనే సందేశాన్ని అందించే బంధమని, రక్త సంబంధానికి ఇది రక్షణ కవచమని తెలిపారు. రాఖీ కట్టి “నువ్వు సురక్షితంగా ఉన్నావు” అని చెప్పే సోదర ధైర్యం, “నిన్ను రక్షించడం నా ధర్మం” అని అన్నయ్య చేయి ఇచ్చే ప్రమాణం, “నీ విజయమే నా ఆనందం” అని చెల్లెలి కన్నులు పలికే ఆశీర్వచనం ఈ పండుగ సారమని వివరించారు.
ఈ పండుగ కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా, కుటుంబ బంధాల, అనుబంధాల, ఆప్యాయతల పునరుద్ధరణకు చిహ్నమని అన్నారు. దశాబ్దాలుగా, యుగాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం, ఈ కాలంలోనూ కుటుంబ విలువలను పునరుద్ధరించే ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. రక్త సంబంధం మాత్రమే బంధం కాదని, బాధ్యతే అసలు బంధమని కుమారస్వామి స్పష్టం చేశారు.
