భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు న్యూ ఢీల్లీలో ఘన నివాళి.
పీడిత వర్గాల కోసం జీవితాంతం నిస్వార్ధంగా పనిచేసిన, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమూల్యమైనవని ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శుక్రవారం ఉదయం బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా, న్యూఢిల్లీలోని బాబు స్మారక స్థలం” సమతా స్థల్ “వద్ద పుష్పాలు సమర్పించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం న్యూ ఢీల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలలో కూడా ఆయన పాల్గొని అంజలి ఘటించారు ..
హైదరాబాద్ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ
హైదరాబాద్ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం, హర్యానా మాజీ గవర్నర్ బందారు దత్తాత్రేయ నల్లకుంట కూరగాయల మార్కెట్‌లో గల...
Read more