• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన వారి మీద చర్యలకు డీజీపీ కి కేసీఆర్ ఆదేశం..

AdminbyAdmin
27/06/2021
inFlash News, Government, News
0
మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన వారి మీద చర్యలకు డీజీపీ కి కేసీఆర్ ఆదేశం..

ప్రగతి భవన్: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగుడూరు మండలంలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు డిజిపి శ్రీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. చింతకానికి వెల్లి లాకప్ డెత్ సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపీని సీఎం ఆదేశించారు.

సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే శ్రీ భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీ జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ ప్రీతమ్ తదితరులు ఇవాళ ప్రగతి భవన్ లో సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రేస్ శాసన సభా పక్షనేత శ్రీ భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి శ్రీ పువ్వాడ అజయ కుమార్, ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సీఎం సూచించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో, ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమించం. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలి’’ అని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో హోంశాఖా మంత్రి శ్రీ మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి. వినోద్ కుమార్, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: addagudurDGP mahender reddyKCRlockup deathmariyammapragathi bhavanyadadri
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News