స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు
ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అవసరార్థులకు దుప్పట్ల పంపిణీ
మానవ సేవే మాధవసేవ అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం గమనించే ఉంటాం.. ఈ నేపధ్యంలో శుక్రవారం కర్మన్ ఘట్ ప్రాంతంలో బీసి కులాల ఐక్య వేదిక అధ్వర్యంలో సంత్ గాడ్గే మహారాజ్ 68వ వర్ధంతి సందర్భంగా దుప్పట్ల పంపిణీ, స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన నివసిస్తున్న అనాధలకి దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, అతిధిగా శివ ముదిరాజ్, సమన్వయకర్తగా బ్రహ్మ మరియు ప్రజా సంఘ నేతలు, కుల సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఆత్మే పరమాత్మ అని ఆధ్యాత్మికత బోధిస్తుంది.. అందుకే ప్రతి ఆత్మలో పరమాత్మను దర్శించాలని అన్నారు..
అలా సాటివారికి సాయపడి, మానవత్వం కలవారిగా నిరూపించుకొన్న వారే మహనీయులవుతారని.. అవసరార్థులకు సేవ చేయడం మాధవ సేవ అవుతుందని తెలిపారు..సేవాభావం అనేది సహజ లక్షణం కావాలి. అందరిపట్ల ఆదరణ, నిస్వార్థ ప్రేమ, మర్యాదగా నడుచుకోవడం మొదలైన అలవాట్లు సేవాభావానికి దారితీస్తాయని పేర్కొన్నారు.
పేదలలో, బలహీనులలో, వ్యాధి పీడితులలో ఈశ్వరుణ్ని చూసేవాడే నిజమైన భగవత్ ఆరాధకుడని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని సూచించారు.. ప్రస్తుతం ఇలాంటి సేవా భావాన్ని కొన్ని ట్రస్ట్ లు ఆచరించడం కనిపిస్తుందని తెలిపిన కుమార స్వామి.. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని తెలిపారు. పేదలను ఆదుకొనుట, అనాధలకు, నిరాశ్రయులకు భోజనంతోపాటు దుప్పట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.. శివ ముదిరాజ్ మాట్లాడుతూ సేవాగుణమే మనుషులను ఉత్తములుగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు. సంతు గాడ్గే బాబా సామాజిక సేవే ధ్యేయంగా సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.ఈమేరకు ఇక్కడికి వచ్చిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.