ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. కాగా… మరికొద్దిసేపట్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more