నగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన\n ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more