రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని రోడ్లు భవనాలశాఖమంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గతంలోనే ప్రాథమికంగా అంగీకారం తెలిపినా, ప్రస్తుతం దానికి సంబంధించిన 338 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తూ ఆమోదించిందని చెప్పారు. మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ విష యం తెలిపారు. సంగారెడ్డి నుంచి ప్రారంభమైన రీ జినల్ రింగ్‌రోడ్డు తిరిగి సంగారెడ్డికి చేరే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం వెనుక సీఎం కేసీఆర్ చేసిన కృషి అమోఘమన్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు పొడవు.. సంగారెడ్డి నుంచి నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్లు. దీనిని ఎన్‌హెచ్ 161ఏఏగా ప్రకటించారు. అలాగే చౌటుప్పల్ నుంచి యాచారం- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- శంకర్‌పల్లి- కంది (సంగారెడ్డి) వరకు 186 కిలోమీటర్లు. మొత్తం 338 కిలోమీటర్ల నిడివి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకిఅప్పగించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more