సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లాలో,
ఈరోజు సిద్దిపేట లో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చెయ్యడం జరిగింది. అందులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు అన్ని ముగించుకొని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో వస్తుండగా హరీష్ రావు కారుకు ముందుగా వెళ్తున్న పైలెట్ కారుకు అడవి పంది అడ్డుగా రావడంతో కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వెయ్యడం తో హరీష్ రావు కారు పైలెట్ కారుని ఢీకొట్టింది, దానితో ఒకదానికొకటి కాన్వాయ్ ఢీకొనడంతో వెళ్తున్న కార్లన్నీ దాదాపుగా ధ్వంసం అయ్యాయి. అందులో ఉన్న సెక్యూరిటి సిబ్బందికి మాములు గాయాలయ్యాయి. ఇందులో మంత్రి హరీష్ రావు కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. హరీష్ రావు వేరే కారులో హైదరాబాద్ కి బయలుదేరారు..
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more