సౌదీ: కఠిన చట్టాలను అమలు చేస్తుందన్న పేరున్న సౌదీ అరేబియా మరో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి కఠిన నిబంధనలు దేశానికి వలస వచ్చిన విదేశీయులకు కాకుండా, స్వదేశీ పౌరులకు కూడా అమలు చేస్తోంది. వలసదారులను హింసిస్తే… చిత్రహింసలకు గురి చేస్తే… కఠిన శిక్షలు ఉంటాయని తేల్చిచెప్పేసింది. అంతే కాకుండా వలసదారు తమ యజమానిని మార్చుకునే అవకాశాన్ని కూడా సౌదీ కల్పిస్తోందని లేబర్ మినిస్టర్ అలీ అల్ ఘాఫీ తెలిపారు. వరుసగా మూడు నెలలపాటు జీతాన్ని ఇవ్వకపోయినా, ఇంట్లో ఎవరైనా వలసదారును అవమానించినా, హింసించినా… అక్కడ పనిమానేసి వేరే చోట పనిచేయొచ్చన్నారు. అలాగే సౌదీలో అడుగుపెట్టిన 30 రోజుల్లోపు రెసిడెన్సీ వీసాను యజమాని వలసదారుకు తెప్పించలేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. సౌదీ అరేబియా లో పొట్టకూటి కోసం వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్న వారికి ఇది శుభవార్త గా చెప్పుకోవచ్చు..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more