సిరిసిల్ల జిల్లా : రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కొత్త భవనంలోకి వర్షపు నీరు వస్తుంది అనే వార్తలకు స్పందించిన కార్యనిర్వాహక ఇంజనీయరు కార్యాలయము రహదారులు మరియు భవనముల శాఖ వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయము కొత్తగా నిర్మాణం జరిగినది. ఇట్టి నిర్మాణం సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తులతో నిర్మాణం జరిగింది. అట్టి కలెక్టరేట్ నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయడం జరిగింది. అందులో ఎక్స్ పాన్ షన్ జాయింట్ పని రిపేరులో ఉన్నది. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు లేవు. అన్ని కార్యాలయాల పనులు, మీటింగ్ లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుచున్నదన్నారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల రగుడు ఫిల్టర్ బెడ్ వద్ద నుండి వచ్చే వాగు ఉదృతిగా వస్తుండడంతో మరియు రగుడు జంక్షన్ నుండి వచ్చే వాగు నుండి వరద వస్తుండడంతో నీటి ప్రవాహం ఎక్కువగా వుండి కలెక్టరేట్ గేటు వద్ద నీరు చేరినది. వరద ఉదృతి తగ్గగానే నీరు వెళ్ళిపోయి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. రాబోయే కాలంలో కలెక్టరేట్ కార్యాలయం ఆవరణ అవతల కాలువల నిర్మాణం పూర్తి అయిన పిదప ఎటువంటి ఆటంకం ఉండదు అని ప్రెస్ నోట్ లో కార్యనిర్వాహక ఇంజనీయరు, రహదారులు మరియు భవనముల శాఖ వారు స్పష్టం చేశారు.