బొడుప్పల్ :
- నిరుద్యోగులంటే అంత చులకననా?
- దొరికితే దొంగా…దొరకకపోతే దొరనా?
- మాట్లాడింది చూపిస్తే మీడియాపై నిందలా?
- నిరుద్యోగులకు, మీడియాకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బొడుప్పల్ TNSF ఆధ్వర్యంలో రామోల శ్రవణ్ కుమార్ అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన TNSF బృందం..
నిరుద్యోగుల పోరాటాలు…అమరుల త్యాగాలపై గద్దెనెక్కి మంత్రి పదవి చేపట్టి… నిరుద్యోగ యువతను కించపరచడమే కాకుండా వారి ఆత్మాభిమానాలు హరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని TNSF డిమాండ్ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన ఎజెండాతో పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ అమాయక యువకుల ప్రాణత్యాగాలతో పీఠమెక్కిన టిఆర్ఎస్ పార్టీ నేడు అదే యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయని నోరుజారిన మంత్రి మళ్లీ మీడియా వక్రీకరించిందంటూ కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.
ఈ మధ్యకాలంలో మంత్రులు అధికార,ధన మదంతో ఒకరు మహిళలను కించపరిస్తే…మరొకరు మహిళలను రోడ్డు వెంబడి గంటల తరబడి నిలబెడుతూ వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా వనపర్తిలో నిరంజన్ రెడ్డి మంత్రి అయ్యాక అక్రమ సంపాదనతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, 6 విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, తెలంగాణ వాదులు, అమరవీరుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణకు తూట్లు పొడిచే విధంగా నేడు మంత్రుల వ్యవహారశైలి.
మరీ ముఖ్యంగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహారశైలి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుందని, ఒకసారి మంత్రి నిరంజన్ రెడ్డి గతం గుర్తుకు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
ఇకనైనా మంత్రి తన తప్పును ఒప్పుకుని నిరుద్యోగ యువతపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగులను అవహేళన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోమహమ్మద్ షుకూర్,TNSF నాయకులు కొలుకులపల్లి జయెందర్,ఎస్.సి.హెచ్ సవీందర్ చౌహాన్, సాయి,శివ, శాదుల్,రాము తదితరులు పాల్గొన్నారు