భూదాన్ పోచంపల్లి: తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా, భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బసవ లింగేశ్వర కాలనీకి చెందిన వేముల నిర్మల (45) మంగళవారం ఉదయం పోచంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
అయితే వాటర్ ను తీసుకెళుతున్న కట్కూరి రాజు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడారు. ఇంట్లో తన ఇద్దరు కొడుకులు పదే పదే గోడవపడుతుంటే చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది అని తెలుస్తుంది.