మా జీవితంలోకి చిన్నారి దేవత మంగళవారం మా జీవితంలోకి చిన్నారి దేవత వచ్చింది. గడిచిన తొమ్మిది నెలలు చాలా ఎక్సైటింగ్‌గా, స్పెషల్‌గా గడిచాయి. ఈ సంతోష సమయంలో మా వెంట నడిచిన సన్నిహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్క్షతలు. మా జీవితం ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు అని ఆసిన్ దంపతులు ప్రకటనలో వెల్లడించారు. నా కూతురు నాకు లభించిన జన్మదిన కానుక అని ఆసిన్ తెలిపింది.
సినీ నటి ఆసిన్ తొట్టుంకాల్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. తమకు ఓ ఆడ కూతురు జన్మించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది జనవరి 19న మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను ఆసిన్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలోకి ప్రవేశించిన ముద్దుల చిన్నారికి ఘనమైన ఆహ్వానం పలికామని ఆసిన్ దంపతులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్, ఆసిన్ దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు.