జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్‌చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త లెఫ్టినెంట్ గవర్నరును నియమించారు. మనోజ్ సిన్హా యూపీలోని ఘాజీపూర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా మూడు సార్లు ప్రాతినిథ్యం వహించారు. రైల్వేసహాయ మంత్రిగా కూడా పనిచేసిన సిన్హాను రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమించారు. జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ముర్ము రాజీనామా ఆమోదంతో ఆయన్ను తదుపరి ‘కాగ్’గా నియమితులవుతారని వార్తలు వస్తున్నాయి.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more