న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్‌నాయక్‌పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.
వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్‌నాయక్‌కు మిలిటెంట్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆయన టీవి ఛానల్‌ను ప్రసారాలను బ్యాన్ చేసింది.
తన ప్రసంగాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని జకీర్‌నాయక్‌పై ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ, తేదిన జకీర్‌నాయక్‌పై ముంబై స్పెషల్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో జకీర్‌నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
నాయక్ నిర్వహించే సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిందని ఆ సంస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం.