DRDO Drug 2-DG: కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఓ పొడిని తయారుచేసింది. గ్లూకోజ్ పౌడర్ మాదిరిగానే దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని చెప్తుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) దీనికి అనుమతి ఇచ్చింది.
DRDO చాలా పెద్దది అందులో న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీడ్ సైన్సెస్ (INMAS) అనే సంస్థ ఒకటి ఉంది. అదే ఓ ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG (2-డియోక్సీ-D-గ్లూకోజ్). ఈ మందు ద్వారా 53% పేషేంట్లు 3 రోజులలోనే రికవరీ అయినట్లు చెపుతున్నారు. అంతేకాదు దీనివల్ల మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోంది అంటున్నారు.
ఇది అన్ని మందుల లాంటిది కాదు. అసలు దీన్ని తయారుచేసిన విధానమే ప్రత్యేకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం, ఈ పొడి, కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి బాగవుతాయి. తొందరగా పేషెంట్లు రికవరీ అయ్యి కోలుకుంటారు.
మొదటి, రెండు ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలతో DCGI ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు కూడా ఎమర్జెన్సీ వాడకం అనుమతులే ఉన్నాయి.
మూడో దశ ట్రయల్స్ పూర్తై రిపోర్ట్ వస్తే, ఈ డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది.