హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం అంతటా కొవిడ్ వ్యాధి పేషెంట్లను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించి వారికి అవసరమైన మందులు ఇంటివద్దనే అందివ్వడం ద్వారా ఆసుపత్రిలో చేరే అవకాశం తగ్గించడం ఈ సర్వే ఉద్దేశం. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం, మున్సిపల్, గ్రామ పంచాయితీ, రెవెన్యూ ఉద్యోగులతో కూడిన వేలాది బృందాలు రాష్ట్రంలోని ప్రతి టౌన్, గ్రామంలో ఈ సర్వే చేస్తున్నాయి.