సముద్ర జలాల్లోనూ కవ్విస్తోన్న చైనా?
చైనా హిందూ మహాసముద్ర జలాల్లోనూ భారత్ ను కవ్విస్తోంది. కొన్నేళ్లుగా చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తరుచుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి వచ్చి వెళుతున్నాయి. చైనాకు చెందిన అణు జలాంతర్గాములు కూడా ఈ మధ్య హిందూ మహాసముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. దీంతో భారత నౌకాదళం దీనిపై దృష్టిసారించింది. తమ గస్తీని మరింత బలోపేతం చేయడం ద్వారా చైనాకు చెక్ చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
24 గంటలూ యుద్ధనౌకల పహారా…
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు మన యుద్ధనౌకలు పహారా కాసేలా.. కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, నావల్ శాటిలైట్ అయిన జీశాట్-7తో అంతరిక్షణం నుంచి కూడా ఆ ప్రాంతంపై రియల్ టైమ్ నిఘా ఏర్పాటు చేయనున్నారు.
2027 నాటికి మరింత శక్తిమంతం…
ప్రస్తుతం భారత నౌకాదళంలో 138 యుద్ధనౌకలు, 235 ఎయిర్‌క్రాఫ్ట్ , హెలీకాప్టర్లు ఉన్నాయి. వీటి సంఖ్యను 2027 నాటికి భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యుద్ధ నౌకలను 212కు, హెలీకాప్టర్ల సంఖ్యను 458 పెంచుకోవాలని.. నేవీ అధికారులు భావిస్తున్నారు.
నౌకాదళ బలం మరింత పెంపు…
సముద్ర జలాల గుండా భారత్ కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్నది మన నిఘా వర్గాల తాజా సమాచారం. హిందూ మహాసముద్రం మీదుగా ఉగ్రవాదులు ఎప్పుడైనా.. ఎక్కడైనా విరుచుకుపడే ప్రమాదమున్నట్లు గుర్తించారు. దీంతో హిందూ మహాసముద్రంలో ఉన్న తమ నౌకాదళ బలగాన్ని మరింత శక్తివంతం చేసే దిశగా అవసరమైన చర్యలను భారత్ చేపట్టింది.
హిందూ మహా సముద్రం..