సైబరాబాద్ లో అన్నీ వర్గాల ప్రజల సహకారంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., తెలిపారు.నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన సైబరాబాద్ పోలీస్ అధికారలు, జీహెచ్ఎంసీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ కో, ట్రాన్స్ పోర్ట్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్ మెంట్ తదితర శాఖల అధికారులు, భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు, సైబరాబాద్ ట్రాఫిక్ వాలంటీర్లు, ప్రజలు, మీడియాకు, గణేష్ మండల నిర్వాహకులకు కమీషనర్ ఈ సందర్భంగా సీపీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు పోలీస్ శాఖ ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖల అధికారులతో కలిసి పని చేశామని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగాయన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వాలంటీర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామన్నారు. ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున నిమజ్జనంతో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.