సచివాలయ కూల్చివేత పనులు శుక్రవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. సచివాలయం కూల్చివేత పనులతో కాలుష్య సమస్య ఏర్పడుతోందంటూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పిటిషన్ వేయడంతో హైకోర్టు స్టే విధించింది. దీంతో 7 నుంచి 10వ తేదీ వరకు కొనసాగిన పనులకు వారం పాటు బ్రేక్ పడిది. తాజాగా ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసు ఆంక్షల మధ్య డీ, జే బ్లాకుల కూల్చివేత పనులు చేపట్టారు. వాస్తవానికి కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ… సచివాలయానికి అన్ని దిశలా కిలో మీటరు వరకు ఆంక్షలు కొనసాగాయి. ట్రాఫిక్‌ను అనుమతించలేదు. శుక్రవారం పనులు నెమ్మదిగా సాగినా… శనివారం నుంచి వేగం పెరిగే అవకాశముంది. మూడు, నాలుగు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి కావచ్చు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more