• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

తెలంగాణ “దళిత బంధు పథకం” అమలుకై హుజురాబాద్ కి పయణం

TP NewsbyTP News
23/07/2021
inFlash News
0
తెలంగాణ “దళిత బంధు పథకం” అమలుకై హుజురాబాద్ కి పయణం

ప్రగతి భవన్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొలి అవగాహన సదస్సును ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగనున్నది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ పాల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.

ఈ సదస్సు గురించి సీఎం వివరిస్తూ ‘‘జూలై 26న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ కు మొత్తం 427 మంది పలు బస్సుల్లో బయలు దేరుతారు. ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకుంటారు.’’ అని సీఎం తెలిపారు.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘దళిత బంధు’ పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభంకానున్న దళిత బంధు పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది, పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె, దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి? సీఎం మానస పుత్రికయిన ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె, కలిసి పోవాలె? అనే తదితర అంశాలను ఇంటరాక్షన్ సెషన్ లో హాజరైన వారికి సీఎం వివరించి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొనసాగే అవగాహన సదస్సు సాయంత్రానికి ముగుస్తుంది.

Tags: Dalith empowermentdalitha banduGovernament of Telanganahuzurabadkalvakuntla chandra shekar RaoKCRpragathi bhavan
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News