• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతోపాటు, అందులో పచ్చదనాన్ని పెంచాలి – కేసీఆర్

TP NewsbyTP News
13/09/2021
inFlash News
0
లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతోపాటు, అందులో పచ్చదనాన్ని పెంచాలి – కేసీఆర్

ప్రగతి భవన్ (తొలిపలుకు న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో, అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతోపాటు, అందులో పచ్చదనాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 11 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వ ద్వారా హైదరాబాద్ నగరంలోని వాతావరణ పరిస్థితుల సమతూకాన్ని పాటించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

జీఓ నం. 111పై చర్చ సందర్భంగా ఈ జీఓ పరిధిలోని 84 గ్రామాల విస్తీర్ణం, 1 లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని, ఇది సుమారు జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్న ప్రాంతానికి సరిసమానమని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్ కు అనుబంధంగా, హెచ్ఎండీఏ పరిధిలో విస్తరిస్తున్న ప్రాంతం ఇంకొక కొత్త నగరానికి సమానంగా వైశాల్యం ఉన్నందున, ఇంత పెద్ద ప్రాంతాన్ని నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దకపోతే జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున, అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటినుండే సమగ్ర ప్రణాళికల ద్వారా గ్రీన్ జోన్లు, సివరేజ్ మాస్టర్ ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అటవీ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, జలాశయాలన్నింటిని పరిరక్షిస్తూ, ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.

అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందితే జలాశయాలు కాలుష్యపూరితమై ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అలాగే, రాబోయే తరాలకు కూడా నియంత్రిత విధానంలో జరిగే సమతుల అభివృద్ధి కోసం పూర్తి ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన చర్చ, నిర్దిష్టమైన ప్రణాళికల ద్వారా జీఓ 111 పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి, కోర్టును ఇంకా కొంత వ్యవధి కోరాలని సమావేశంలో నిర్ణయించారు.

Tags: chief ministerGovernament of TelanganahimayathsagarHyderabadkalvakuntla chandra shekar RaoKCRkondapochammapragathi bhavanReal Estate
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News