రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు
పక్షపాతం లేని జర్నలిజంతో ముందుకు సాగుతాం: రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీ రావు
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ కార్యాలయంలో చైర్మన్ లక్ష్మీ రావు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మీ రావు మాట్లాడుతూ, పక్షపాతం లేని జర్నలిజంతో రాజ్ న్యూస్ ముందుకు సాగుతుందని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఛానల్ ప్రధాన అజెండాగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ వేడుకల్లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖ–సంతోషాలు, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో చైతన్యం తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంలో రాజ్ న్యూస్ పాత్ర అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా రాజ్ న్యూస్ ఛానల్ ఎండి సాహితీరావు మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ఛానల్‌కు మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రజలకు నిజమైన, నిష్పక్షపాత వార్తలను అందించడమే రాజ్ న్యూస్ లక్ష్యమని పేర్కొంటూ, బాధ్యతాయుత జర్నలిజంతో సమాజానికి సేవ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ ఛానల్ ఎండి సాహితీరావు, ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నా
