వరంగల్ జిల్లా నేరెడుపల్లి గ్రామం లో జన్మించిన మండువ. మధుసూదన్ శర్మ గత 26సంవత్సారాలు గా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ గ్రామంలో నివసిస్తూ అదే గ్రామంలో గల బీరప్ప మల్లన్న స్వామీ దేవాలయం లో ప్రధానఅర్చకులు గా విధులు నిర్వహించుకుంటూ, పాత్రికేయ రంగంలో కూడ రాణిస్తూ తన తోటి పేద బ్రాహ్మణులకు అనాధ పిల్లలకు వృద్ధ ఆశ్రమాలలో తన వంతు సహాయం చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. అవి గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు శిఖరంఆర్ట్స్ వారు ఢిల్లీ లో జాతీయ పురస్కారాలు , కన్నతల్లి ఫౌండేషన్ వారు వరంగల్ లో కాకతీయ సేవా నంది అవార్డు లు ఉత్తమ సేవ పురస్కారాలు . ఉత్తమ పాత్రికేయ మరియు అర్చకాగ్రణ్య పురోహితశేఖర అవార్డు లు అందజేసారు. వీటిని గుర్తించిన ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు 19-03-2022 శనివారం రోజున బెంళూరులోని హోసూరు లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దానికి మండువ. మధుసూదన్ శర్మ మాట్లాడుతూ తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన యూనివర్సిటీ కి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు వచ్చిన గౌరవ డాక్టరేట్ ప్రదానం తో తన సేవా భాధ్యత మరింత పెరిగిందని విలేకరుల సమావేశంలో చెప్పారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more