బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
అంతర్జాతీయ సేవా సంస్థ బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ (Blissberg Future of Hope)ఆధ్వర్యంలో కార్పొరేట్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కార్పొరేట్ సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరై క్రిస్మస్ సందేశాన్ని పంచుకున్నారు. ప్రేమ, శాంతి, మానవ సేవ అనే క్రైస్తవ ధర్మ విలువలను ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (Dundra Kumara Swamy)మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ సమాజంలో సోదరభావం, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించే పండుగగా నిలుస్తుందని అన్నారు. మతాలకు అతీతంగా మానవత్వమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ వినయ్ సరికొండ(Dr.Viinay Sarikonda) , ప్రొఫెసర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.