• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మరోసారి కులగణన

AdminbyAdmin
16/02/2025
inNews
0
మరోసారి కులగణన

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా పునర్నిర్మాణం చేయొచ్చు

భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది

మనలో ఎన్నో అనుమానాలను రేకెత్తించి, రెచ్చగొట్టే కుట్రలు జరుగుతూ ఉన్నాయి

కులగణన సర్వేలో పాల్గొనండి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. సామాజిక అసమానతలు, సాంఘిక వివక్ష రూపం ఆపడానికి కుల గణన అవసరమని రాహుల్ గాంధీ భావించారు కాబట్టే ఆయన కులగణన కోసం నిలబడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా అడుగులు వేశారు. ఈ కులగణన దేశానికే ఆదర్శం. తెలంగాణలో కులగణన ఓ చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ రావడానికి రాహుల్ గాంధీ ప్రధాన కారణమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. రాహుల్ గాంధీ కులగణన అంశానికి దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్. విదేశీ పర్యటనలో సైతం ఆయన కులగణన గురించి మాట్లాడారు.

తెలంగాణ కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి వెనుకబడిన తరగతులకు ముఖ్యమంత్రి న్యాయం చేశారు. కుల గణనలో బీసీ జనాభా లెక్కలు తీసుకుని వస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ హామీని రేవంత్‌రెడ్డి నెరవేర్చారని, అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రి బీసీ వర్గాలకు అనుకూలమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశంలో రాజ్యాంగ హక్కులను దెబ్బతీసే పనిలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలులో భాగంగా బీసీ కులాల గణన పూర్తీ చేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. 2024 ఫిబ్రవరి లో, రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. బడ్జెట్ రూ.150 కోట్లు కేటాయించింది. 2024 మార్చ్15న అందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. మొదట బీసీ కమిషన్ ద్వారా లెక్కలు తీయాలని భావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ నిర్ణయించడానికి బీసీ జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ నియమించాలని ఉంది. సీఎం రేవంత్ రెడ్డి డెడికేషన్ కమిషన్ ను నియమించారు. ఈ కమిషన్ చైర్మన్ గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ను కూడా నియమించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.

అత్యంత ప్రతిష్టాత్మకంగా 50 రోజులపాటు కుల గణన సర్వే నిర్వహించారు. 1,3889 మంది అధికారులతో సర్వే చేశారు. రాష్ట్రంలో 96.9 %కుటుంబ వివరాలను అధికారులు సర్వే చేశారు. మిగిలినది 3.1 శాతం పాల్గొనలేదని సమాచారం. బీసీ జనాభా తగ్గడంతో బీసీ మేధావులు కుల సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే మరోసారి కులగణన సర్వేకి అవకాశం ఇచ్చారు మళ్లీ కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 3.1 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుండి 28 వరకు కులగణన రీ సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్వేలో పాల్గొనని వాళ్లు ఆన్‌లైన్, టోల్‌ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి వివరాలు ఇవ్వొచ్చని తెలిపింది.

ప్రభుత్వం ఈ సర్వేను చాలా శాస్త్రీయంగా, సహేతుకంగా చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా లెక్కలు తీసి, శాసనసభలో పెట్టారు. వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పించడం శుభసూచకం. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలి.. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పై మార్చి మొదటి వారంలో కేబినెట్‌ తీర్మానం చేయనుందని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి జరుగుతూ ఉంది. ఓబీసీలకు మేలు జరగకూడదని కుట్ర చేసేవారు. రాజకీయాలను పక్కన పెట్టి ఈ చర్యలకు మద్దతు ఇవ్వాలి.

కొన్ని భయాల కారణంగానే, ఎవరైనా ఏదైనా చెప్పారని విని కొందరు కులగణనలో భాగమవ్వలేదు. అలాంటి వాళ్లు భయాలు వీడండి, దయచేసి మీరు, మీ కుటుంబ సభ్యులు సర్వేలో భాగమవ్వండి. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ విజ్ఞప్తులపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో మార్చిలో కేబినెట్‌లో తీర్మానం పెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపి, ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఉంది.

ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి.. ఎంతవరకు న్యాయం జరిగిందో మీరే చెప్పండి. బీసీలకు మంచి చేయడానికి ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. లెక్కల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలను ఎంతగానో మోసం చేస్తోంది. మంచి చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టే.. తెలంగాణలో కులగణన నిర్వహించారు. బీసీ నేతలు ప్రభుత్వానికి మరి కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు, పేదలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్న ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలి. ఈ సర్వే నివేదిక, డేటా ఆధారంగా పేదలకు సంక్షేమ పథకాలు, రాజకీయాలు, విద్య తదితర రంగాల్లో అవకాశాలు కలుగుతాయి. సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా పునర్నిర్మాణం చేయొచ్చు.

బీసీలను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు కూడా సాగుతూ ఉన్నాయి. వాటిని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. బీసీలకు దక్కాల్సింది దక్కకపోతే తప్పకుండా పోరాటం చేద్దాం. ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కుల సంఘాలు కోరడంతో మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అదే సర్వే పూర్తయ్యాక మరిన్ని డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచుదాం. కులగణనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాం. సర్వే లెక్కల ప్రకారం రేపటి ప్రయోజనాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

Tags: Bc dal kumaraswamyCaste census once againCastecensus LoksabhaNational president BC Leader Dundra Kumara SwamyTelangana state
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News