యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యటించారు. ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళిత బంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా దళిత నాయకుడు ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా? రైతు బంధు డబ్బులు వస్తున్నయా? ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more