కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 285(ఏ)ను సవరించి, 50% సీలింగ్‌ను తొలగించి, ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9ను సామాజిక కుల సర్వే ఆధారంగా డెలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు రూపొందించింది. ఈ జీఓను సమర్థిస్తూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డా. అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు.
రాష్ట్ర హైకోర్టు జీఓ నంబర్ 9ను నిలుపుదల చేస్తూ ఎలాంటి తాత్కాలిక నిర్ణయం తీసుకోకపోవడం శుభ పరిణామమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ఈరోజు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో జీఓ 9కు మద్దతుగా నిలబడ్డామని ఆయన అన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయం పక్షాన నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు రిజర్వేషన్ వ్యతిరేకులు భావించినట్లుగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు స్టే ఇవ్వకపోవడం గొప్ప నిర్ణయమని, ఇది దాదాపు బీసీలు 90 శాతం గెలిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జన జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు మురళి కృష్ణ మరియు ఇతర కుల సంఘ నేతలు పాల్గొన్నారు.
