హైదరాబాద్ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ
శుక్రవారం ఉదయం, హర్యానా మాజీ గవర్నర్ బందారు దత్తాత్రేయ నల్లకుంట కూరగాయల మార్కెట్‌లో గల మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు నివాసానికి స్వయంగా వచ్చి తన ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, “డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు నిబద్ధతతో పనిచేసిన బీసీ ఉద్యమకారుడు, బీసీ వర్గాల మేధావి. BC కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం చేసిన సేవలు గొప్పవి” అని అన్నారు.
డా. వకుళాభరణం మాట్లాడుతూ, “దత్తాత్రేయ గారు హైదరాబాద్ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి విలువలతో జీవించే రాజకీయ నాయకుడిగా ఉన్నారని ఆయనను కొనియాడారు. అలాంటి వ్యక్తి మా ఇంటికి స్వయంగా రావడం మా కుటుంబానికి గౌరవదాయకమైన క్షణం” అని తెలిపారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ వకుళాభరణం దంపతులను శాలువాతో సత్కరించి, శ్రీకృష్ణ కాంస్య విగ్రహం మరియు తన ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు. వకుళాభరణం కూడా దత్తాత్రేయకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డా. వకుళాభరణం సతీమణి సుధా శ్రీ, కుమారుడు ప్రహల్లాద్ పాల్గొన్నారు. అనంతరం దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో సుమారు గంటసేపు స్నేహపూర్వకంగా ముచ్చటించారు.