లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు
బోనాలు- చారిత్రక పండగల వైభవానికి ప్రతిరూపం-జాతయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది
లష్కర్ బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి మొక్కులు తీర్చాురు.
ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో జరిగిన ఊరేగింపులు, పోతరాజుల కళాప్రదర్శనలు, మహిళలు భక్తిశ్రద్ధతో బోనాలు మోసి అమ్మవారికి సమర్పిస్తున్న దృశ్యాలను వారు స్వయంగా చూశారు. వేపాకు, పసుపు, నెయ్యి దీపం, బెల్లం, బియ్యం కలగలిపిన బోనాలు — ఆరోగ్యం కోసం సమాజపరమైన సంకల్పంగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు.
1813లో మహమ్మారి సమయంలో సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండగా, సూరి అప్పయ్య ముదిరాజ్ మొక్కుతో ప్రారంభమైన లష్కర్ బోనాలు — నేటికీ ప్రజల ఆధ్యాత్మిక ఐక్యతకు నిదర్శనమని నేతలు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలంలో “లష్కర్” అనే పేరుతో గుర్తింపుతెచ్చుకున్న సికింద్రాబాద్ ప్రాంతంలో — ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవం, ఆ పేరు మారుమూల ప్రాంతాల వరకూ వ్యాపించడానికి కారణమైంది.
అలాగే, పోతరాజు, మునిపెండె రూపాలు, రంగం వంటి సంప్రదాయ కళారూపాలు — ఈ పండుగను సామూహిక విశ్వాసాలకు ప్రతిబింబంగా నిలిపాయని వారు వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు శాంతి, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని వారు ఆకాంక్షించారు.

