• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి

AdminbyAdmin
14/04/2025
inNews
0
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి

బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి

హైదరాబాద్:
దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళుల కార్యక్రమం జాతీయ బీసీ దళ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రజలు భారీ స్థాయిలో హాజరై, జయంతిని ప్రజా ఉత్సవంగా మార్చారు.
అనేకమంది అభిమానులు, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ సేవలను స్మరించుతూ, నినాదాలతో మారుమోగాయి.విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భం జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మీడియాతో మాట్లాడుతు
“బాబాసాహెబ్ పుట్టి ఉండకపోతే వంచిత, బలహీన, నిమ్న తరగతులకు, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు రాజ్యాంగ హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ లభించేవి కావు. ఆయన లేకపోతే ఈ దేశ ప్రజాస్వామ్య రూపం భిన్నంగా ఉండేది .అంబేద్కర్ చూపిన మార్గం – మానవ సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ బాధ్యత – ఇవే దేశ భవిష్యత్తు మూలస్తంభాలు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలు ఒకటిగా మారాయి. ఇది బాబాసాహెబ్ చూపిన మార్గాన్ని అనుసరించడమే,” అని ఆయన స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బాల్యంలోనే అస్పృశ్యత, కుల వివక్ష వంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొన్న అంబేద్కర్, స్కూల్‌లో విడిగా కూర్చోవడం, నీళ్లు తాగడానికి అనుమతి లేకపోవడం వంటి అవమానకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలు ఆయనలో సామాజిక మార్పు కోసం పోరాట స్ఫూర్తిని రగిల్చాయి అని తెలిపారు. అందుకే‌”విద్య నీ ఆయుధం; దానితో నీవు ప్రపంచాన్ని జయించగలవు” అనే నమ్మకంతో ఆయన ఉన్నత డిగ్రీలు సాధించారు. విద్య పట్ల ఆయన చూపిన అంకితభావం లక్షల మందికి స్ఫూర్తిదాయకం. హక్కుల కోసం పోరాడకపోతే, ఎవరూ స్వేచ్ఛను ఇవ్వరు” అనే ఆయన సూక్తి దళితుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన నడిపిన ఉద్యమాలకు ఊపిరిపోసింది. అస్పృశ్యత నిర్మూలన, ఆలయ ప్రవేశం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
రాజ్యాంగ రచన కమిటీ ఛైర్మన్‌గా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి సూత్రాలతో బడుగు, బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించారు. “సామాజిక న్యాయం, సమానత్వం లేని సమాజం నిలబడదు; న్యాయం కోసం గొంతు విప్పు” అని ఆయన పిలుపునిచ్చారు. మహిళల సాధికారత కోసం హిందూ కోడ్ బిల్‌ను ప్రతిపాదించి, మహిళలకు ఆస్తి, విడాకుల హక్కులు, సమాన వేతనం వంటి సంస్కరణలకు కృషి చేశారు కొనియాడారు.
ఈ జయంతి సందర్భంగా, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుని, సమానత్వ సమాజ నిర్మాణంలో మనమంతా భాగస్వాములమై, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళదాం. అని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరి కుమార్ నేతలు పాల్గొన్నారు.

Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News