నారపల్లి: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి లో ఎక్సైజ్ & ప్రొహిబిషన్ స్టేషన్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడ కులస్థుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందనీ, అన్ని కులాలను సమానదృష్టితో చూస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్తీ మద్యాన్ని అరికట్టి , ఆరోగ్యానికి ఉపకరించే నీరా కేఫ్ లను పెద్దఎత్తున నెలకొల్పేందుకు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి , డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ , పోచారం మున్సిపల్ ఛైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు …