రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్‌లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more