కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ పరిధిలో ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ డివిజన్ లోని శ్రీవివేకానంద నగర్ వార్డ్ కార్యాలయంలో మరియు పలు బస్తీ లల్లో జెండావందనం చేయడం జరిగింది, ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ మనకి 1947ఆగష్టు 15 న స్వాతంత్య్రం వచింది,కానీ అధికారికంగా రాజ్యాంగ హక్కు ని జనవరి 26 వ తేదీన సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 73 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం.ఎంతో మంది మహనీయులు,తమ కుటుంబాలను వదిలి మన దేశ స్వాతంత్ర్యం కొరకు వారి జీవితాలను పణంగా పెట్టి పోరాడినారు.వారి కష్టానికి ఫలితమే ఈ రోజు మనం స్వేచ్ఛ స్వతంత్ర్యాలతో,ఆనందం,సుఖ సంతోషాలతో మనం జీవించగలగుతున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ,ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, ప్రతి బస్తీ,మరియు కాలనీ కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీ సభ్యులు, వార్డు మెంబెర్లు, ఏరియా సభా సభ్యులు,సీనియర్ నాయకులు,మహిళ కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గున్నారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more