• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Defence

డీఆర్డీవో చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్‌రెడ్డి

TP NewsbyTP News
26/08/2018
inDefence, Featured, India, News, S & T
0
G Satheesh Reddy drdo

డీఆర్డీవో చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్‌రెడ్డి

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. ఆయన రెండేండ్ల పాటు డీఆర్డీవో చైర్మన్‌గా కొనసాగుతారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన రక్షణ పరిశోధన,అభివృద్ధి విభాగం (డీఆర్డీ) కార్యదర్శిగా కూడా ఉంటారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆప్రకటనలో తెలిపింది. ఎస్ క్రిస్టఫర్ పదవీ విరమణ చేసిన అనంతరం గత మూడు నెలలుగా డీఆర్డీవో చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. నెల్లూరువాసి సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆయన 1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు.

drdoనిశ్చల సెన్సర్లు, నావిగేషన్ పథకాలు, అల్గారిథం వ్యవస్థలు, అమరిక పద్ధతులు, సెన్సర్ మోడళ్లను రూపొందించి, అభివృద్ధి చేసిన బృందాలకు సతీశ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఉపగ్రహ నావిగేషన్ రిసీవర్లు, హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన నాయకత్వంలోనే అధునాతన పరికరాలు, వివిధ రకాల ఏవియానిక్స్ వ్యవస్థలు రూపుదిద్దుకొని ప్రయోగాలలో సైతం విజయవంతమయ్యాయి. లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీలో ఫెలో ఆఫ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్‌గా ఆయన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రష్యాలోని ఎకాడమీ ఆఫ్ నావిగేషన్, మోషన్ కంట్రోల్ సంస్థలో శాశ్వతకాల విదేశీ సభ్యునిగా మరో అరుదైన గౌరవం పొందారు. భారత్‌లోని అనేక ఇంజినీరింగ్ సంస్థలలో సైతం గౌరవసభ్యునిగా ఉన్న సతీశ్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక హోమీ బాబా స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు. స్వావలంబన పరిశోధనకు ప్రధాని నుంచి అవార్డుతోపాటు పలు సత్కారాలను అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ నుంచి రజత పతకం అందుకున్న తొలి భారతీయ రక్షణ విభాగం శాస్త్రవేత్త కూడా ఆయనే.

Tags: DRDO
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News