భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు
ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ పద్ధతులతో వైద్య రంగంలో కొత్త దిశ
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు ముందుకు పడింది. డిజిటల్ మార్పులకు నాంది పలుకుతూ, హైదరాబాద్ హైటెక్ సిటీలో BhaArogyam Healthchain Pvt. Ltd. సంస్థ Genesys InfoX సంయుక్తంగా ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 10:30 గంటలకు హైటెక్ సిటీ, GENESYS INFOX, ఫేజ్–2, సైబర్ గేట్‌వే, బ్లాక్–B, 2వ మంజిల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. దిలీప్ భానుశాలి, గౌరవ అతిథులుగా శ్రీ దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,చైర్మన్, Blissberg Future of Hope, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త), డా. వినయ్ సరికొండ (MD, Genesys InfoX), శ్రీ అశోక్ గుప్తా (STPI డైరెక్టర్ & CEO, Apiary–గురుగ్రామ్), డా. అరుణ్ (ప్రెసిడెంట్, THANA), డా. ప్రసాద్ (జనరల్ సెక్రటరీ, THANA), డా. సుభా రెడ్డి (ప్రెసిడెంట్, APNA), డా. శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ, AP), డా. సురేశ్ గౌడ్ (మాజీ ప్రెసిడెంట్, THANA), శ్రీ జయ బజరంగ్ మణి (MD & చైర్మన్, RBMIL), శ్రీ శ్రీధర్ ఐయర్ (CEO), మరియు డా. సుధా రెడ్డి (MD, KNBSIPL), పూజ సరికొండ, వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి Genesys InfoX టెక్నాలజీ భాగస్వామిగా వ్యవహరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5,000 ఏఐ–బ్లాక్ చైన్ ఆధారిత డయాగ్నస్టిక్ సెంటర్లు స్థాపించడమే కాకుండా, 25,000 ఏఐ ఆధారిత అంబులెన్సులు వైద్య అత్యవసర సేవలను మరింత వేగవంతం చేశాయని తెలిపారు. AI టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం బలోపేతం కావడానికీ ఇది దోహదం చేస్తోందని వివరించారు.
ఈ ప్రాజెక్టు గవర్నమెంట్ డిజిటల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్, NABH, DPDP విధానాలతో అనుసంధానమై, డేటా ప్రైవసీ, సమానమైన ఆరోగ్య సేవలు, నిధుల పారదర్శకత దిశగా పునాది వేసింది. భారతదేశాన్ని డిజిటల్, ఆరోగ్యవంతమైన భారత్ వైపు నడిపించే సాంకేతిక విప్లవానికి ఇది నాందిగా మారింది. ఈ “హెల్త్‌టెక్ మిషన్” ప్రాజెక్టు లక్ష్యం — హెల్త్‌కేర్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడం, వైద్య సేవల్లో పారదర్శకత, సమయపాలన, డేటా భద్రతను పెంపొందించడం. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుత వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను సాంకేతికత ద్వారా సరిదిద్దుతూ, ప్రతి రోగికి సమయానుసారంగా సరైన చికిత్స అందేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన దిశగా నిలుస్తుంది.
డా. వినయ్ సరికొండ మాట్లాడుతూ(Dr.Viinay Sarikonda )హాస్పిటల్ మేనేజ్‌మెంట్, పేషెంట్ రికార్డులు, ఔషధ సరఫరా, వైద్య డయాగ్నస్టిక్ రంగాల్లో బ్లాక్‌చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ద్వారా సమగ్ర మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ సాంకేతిక పరిష్కారాలతో వైద్య సేవల నాణ్యత పెరుగుతుందని అన్నారు.
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ(Dundra Kumara Swamy)బ్లాక్‌చైన్ ఆధారిత డేటా భద్రత, AI ఆధారిత చికిత్స విశ్లేషణ, ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ పద్ధతులు వైద్య రంగంలో కొత్త దిశను చూపనున్నాయన్నారు. మానవీయ విలువలను కాపాడుకుంటూ సాంకేతికతను వినియోగించాలనే ధ్యేయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, ప్రజారోగ్య వ్యవస్థను మరింత గొప్పగా మార్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా వైద్య రంగంలో నూతన సాంకేతిక అవకాశాలను పరిచయం చేయడం, ఆరోగ్య సేవల్లో మానవతా దృక్పథాన్ని బలపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో స్ఫూర్తిదాయక మార్పుకు నాంది పలికే కార్యక్రమమిదిగా నిలిచింది.
