సినీ నటి ఆసిన్ తొట్టుంకాల్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి బిడ్డ జన్మించింది. తమకు ఓ ఆడ కూతురు జన్మించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది జనవరి 19న మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను ఆసిన్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తమ జీవితంలోకి ప్రవేశించిన ముద్దుల చిన్నారికి ఘనమైన ఆహ్వానం పలికామని ఆసిన్ దంపతులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్, ఆసిన్ దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు.